ఈనెల 17వ తేదీ ఆదివారం రోజు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌కు టీమిండియా శ్రీలంక జట్లు విశాఖ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.శుక్రవారం నోవాటెల్ హోటల్ నుంచి స్టేడియానికి నెట్‌ప్రాక్టీస్‌కు బయలుదేరిన బస్సు హోటల్ సమీపంలో గోడను ఢీకొనడంతో దానిలో ఉన్న లంక క్రికెటర్లు కలవరపాటుకు గురయ్యారు. వెంటనే డ్రైవరు తేరుకుని బస్సును సరైన దిశలో నడపడంతో అంతా సర్దుకుంది. లంక క్రికెటర్లు యథావిధిగా స్టేడియంలో నెట్‌పాక్ట్రీసు చేసుకుని తిరిగి హోటల్‌కు చేరుకున్నారు.
