Home / MOVIES / టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్.. రంగస్థలం రీషూట్ క‌హానీ ఇదే..!

టాలీవుడ్ బ్రేకింగ్ న్యూస్.. రంగస్థలం రీషూట్ క‌హానీ ఇదే..!

టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ చెక్కుతున్న‌ రంగస్థలం సినిమాకు సంబంధించి ఓ బ్రేకింగ్ న్యూస్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రంతో మెగా హీరో రామ్ చ‌ర‌ణ్‌.. అక్కినేని వారి కోడ‌లు స‌మంత న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే రంగస్థలం సినిమా నుంచి రావు రమేష్ ను తప్పించి.. ఆ స్థానంలో వెంటనే ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారనే న్యూస్ ఒక‌టి బయటికి వచ్చింది.

అయితే రంగ‌స్థ‌లం నుండి రావు రమేష్‌ని తప్పించిన వెంటన.. ప్రకాష్ రాజ్‌తో చకచకా రీషూట్ కూడా పూర్తిచేశారని… ఈ తతంగం మొత్తం కొన్ని రోజుల కిందటే పూర్తయిందని.. మీడియాకు ఎలాంటి లీకులు లేకుండా, అసలు చిత్ర బృందంలోని కొందరికి అక్కడ షూటింగ్ స్పాట్‌లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాకముందే ఈ రీషూట్ ప్రక్రియ పూర్తి చేశార‌ట‌. కాకపోతే రంగస్థలం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు మాత్రం బ‌డ్జెట్ తడిసి మోపడైందని స‌మాచారం.

అసలింతకీ రావు రమేష్ రంగస్థలం సినిమా నుండి తప్పుకోవడానికి కారణమేమిటంటే… ఈ సినిమా దర్శకుడు సుకుమార్‌కి రావు రమేష్‌కు మ‌ధ్య సెట్స్‌లో చిన్న వివాదం చెల‌రేగింద‌ట‌. దీంతో వారి మ‌ధ్య వివాదం రోజురోజుకూ పెరిగి ఇద్ద‌రి మధ్య కోల్డ్ వార్ నడిచింద‌ట‌. ఒక దశలో వ్యవహారం ముదరడంతో రావు రమేష్ తప్పుకున్నాడట. అయన అలా తప్పుకున్నాడో.. లేదో ఇలా ఆ స్థానాన్ని ప్రకాష్ రాజ్‌తో భర్తీచేశారట సుకుమార్‌.

ఇంకో విష‌యం ఏంటంటే రంగస్థలం సినిమాకు సంబంధించి ఇప్పుడు కూడా రీషూట్ ప్రాసెస్ నడుస్తోంది. కాకపోతే అది ప్రకాష్ రాజ్‌తో మాత్రం కాదట. వేరేగా కొన్ని సీన్స్ మీద తృప్తి కలగక సుకుమార్ ఇలా రీషూట్ చేస్తున్నాడట. ఇకపోతే రంగస్థలం సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ లుక్ తో పాటు మరికొన్ని స్టిల్స్ కూడా చిత్ర బృందానికి తెలియకుండా లీక్ అవ్వడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ చిత్ర యూనిట్‌.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat