టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా స్టార్ మాలో చేసిన బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ షో ప్రారంభానికి ముందు చాలా కామెంట్లు వచ్చినా సరే ఫైనల్‌గా షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇయర్ ఎండింగ్‌లో ఈ ఇయర్ గూగుల్ అత్యధికంగా వెతికిన ప్రోగ్రాం లలో బిగ్ బాస్ తెలుగుకు ఆరో స్థానం దక్కించుకుంది.
గూగుల్ సెర్చింగ్‌లో తెలుగు టీవీ షోల్లో బిగ్ బాస్ తెలుగు ఏకంగా 6వ స్థానం సంపాదించడం గొప్ప విషయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ కు ఈ షో ఓ కానుకగా ఇచ్చారు. ఇక ఆ తర్వాత వచ్చిన జైలవకుశ సినిమా సూపర్ హిట్ అందుకుంది. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్‌కు ఓటు వేసే అవకాశాన్ని గూగుల్ లోనే కల్పించారు. ఆ క్రమంగా కూడా బిగ్ బాస్ తెలుగుకి క్రేజ్ వచ్చింది. ఇక తన వాక్ చాతుర్యంతో తారక్ ఆ షో చేసిన తీరుకి అందరు ఫిదా అయ్యారు. బిగ్ బాస్ తెలుగు షో మొదటి సీజన్ విజేతగా శివ బలాజి నిలిచాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ గ్రాండ్ సక్సెస్ అవడంతో రెండో సీజన్ కు స్టార్ మా రంగం సిద్ధం చేస్తోంది.