తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు శనివారం హైదరాబాద్ మహానగరంలో మన నగరం కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు .ఈ పర్యటనలో భాగంగా నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకంతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు .
అందులో భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “నగరంలో ఉన్న సామాన్యుడి స్పందనకు మన నగరం అనే కార్యక్రమం చక్కని వేదిక అని ఆయన అన్నారు .నియోజక వర్గంలో పలు సర్కిళ్ళ నుండి వచ్చిన ప్రజల నుండి పిర్యాదులను ,సలహాలను స్వీకరించారు .ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ నగరంలో కుత్బుల్లా పూర్ నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి దూసుకుపోతుంది .
స్థానిక ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను సర్కారు దృష్టికి తీసుకురావడమే కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు .అందుకు తగ్గట్లు ఎమ్మెల్యే సర్కారు నుండి నిధులు తెప్పించుకొని మరి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి నడిపిస్తున్నారు అని అన్నారు .