తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి .ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ,మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ,తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హాజరయ్యారు .
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “అమ్మకు ,మమ్మీకి మధ్య ఉన్న తేడాను వివరించారు .సీఎం మాట్లాడుతూ “అమ్మకు ,మమ్మీకి మధ్య ఉన్న తేడాను ఉపప్రధాని ఎం వెంకయ్య నాయుడు వివరించారని తెలిపారు .వెంకయ్యకు సాహిత్యం ,అమ్మ భాష మీద చాలా గొప్ప ప్రేమ ఉంది .
ఒకసారి హైదరాబాద్ మహానగరంలో మాట్లాడుతుంటే నేనక్కడే ఉన్నాను .అమ్మ అంటే కడుపులో నుండి వచ్చినట్లు ఉంటుంది .మమ్మీ అంటే పెదవుల మీద నుండి వచ్చినట్లు ఉంటుంది .ఇదే అమ్మకు మమ్మీకి ఉన్న తేడా అని చెప్పారు అని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు ..