తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నుండి జరుగుతున్నప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన బృహత్ కవి సమ్మేళనానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొప్ప భాష, ఆట, పాట, సంస్కృతి కలిగిన రాష్ట్రం తెలంగాణ . తెలంగాణ ఉద్యమంలో పాటల పాత్రను వర్ణించలేము అని ఆయన తెలిపారు. కవికి మానవీయ కోణం, సామాజిక దృక్పథం ఉండాలని చెప్పారు. ఒక సిరా చుక్క ఎంతో మందిని కదిలిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ పాటలు, ఆటలు ప్రజల గుండెల్ని కదిలించాయని గుర్తు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. సీఎం కేసీఆర్ తెలుగు భాషాభిమాని అని ఈటల రాజేందర్ చెప్పారు.
