తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేకు కేంద్ర హోం శాఖ ఝలక్ ఇచ్చింది .రాష్ట్రంలో వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ చేతిలో చుక్కెదురైంది .దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుఫ్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదు అంటూ కేంద్ర హోం శాఖ ఆగస్టు ముప్పై ఒకటిన ఉత్తర్వులను జారీచేసింది .కేంద్ర హోం శాఖ ఉత్తర్వులపై ఎమ్మెల్యే ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించాడు .ఎమ్మెల్యే ఆశ్రయించడంతో హైకోర్టు రమేష్ రివ్యూ పిటిషన్ ను విచారించాలని కేంద్ర హోం శాఖను ఆదేశించింది .దీంతో అప్పటివరకు కేంద్ర హోం శాఖ ఆ ఉత్తర్వులను తాత్కాలిక స్టే విధించింది .తాజాగా రమేష్ వేసిన రివ్యూ పిటిషన్ ను కేంద్ర హోం శాఖ కొట్టేసింది .