ప్రముఖ టీవీ న్యూస్ చానెల్లో తీన్‌మార్ అనే కార్యక్రమంలో తనదైన హాస్యంతో నవ్వులు పూయిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాందించుకున్న బిత్తరి సత్తి.. హైదరాబాద్‌లోని ఫేస్‌బుక్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇంతకీ ఎందుకో తెలుసా.. ఆయన పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్లు తెరిచి వీడియోలు, ఫొటోలు పోస్టులు పెడుతున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లారట.
అయితే తనకు ఇంతవరకూ ఫేస్‌బుక్ అకౌంట్ లేదనీ, ఎవరెవరో తన పేరిట ఖాతాలు తెరిచి పోస్టులు పెడుతున్నారని, ఆ అకౌంట్లను వెంటనే తొలగించాలంటూ హైదరాబాద్ ఫేస్‌బుక్ కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో హాస్యంతో అక్కడి సిబ్బందితో సరదాగా మాట్లాడారు. తనను ఇక్కడ ఎవరూ గుర్తు పట్టనే లేదంటూ మధ్యమధ్యలో ఇంగ్లీష్ మాట్లాడుతూ కడపుబ్బా నవ్వించారు. అంతేకాక, ఫేస్‌బుక్ కార్యాలయ ఉద్యోగులందరికీ బిత్తిరి సత్తి ముందుగానే క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.