తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో పోరాటాల పురిటిగడ్డ తెలంగాణలో ఎందరో మహానుభావులు ఉన్నారని.. అందరినీ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజా గాయని విమలక్క అన్నారు. తెలుగు మహాసభలకు నిరసనగా.. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కరపత్రం విడుదల చేశారు. అందెశ్రీ, గద్దర్ లాంటి వారు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు.ప్రపంచ తెలుగు మహాసభలతో చాలామందికి సరైన గౌరవం దక్కడం లేదన్నారు
