కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఇప్పటికే తనయుడు ,కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్ధి రాహుల్ గాంధీకి త్వరలోనే ఆ పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పజేప్పనున్న నేపథ్యంలో తాజాగా సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంతో యావత్తు దేశమే షాక్ కు గురైంది .
రేపు శనివారం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో సోనియా గాంధీ తాజాగా తీసుకొన్న నిర్ణయంతో తన భవిష్యత్తు గురించి సంకేతాలు పంపినట్లు అయింది .అసలు విషయానికి వస్తే ప్రత్యేక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ఆమె తెలిపారు .దాదాపు పంతొమ్మిది ఏళ్ళ పాటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ,రెండు సార్లు పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన పాత్ర పోషించిన ఆమె తాజాగా తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ వర్గాలు విస్మయానికి గురయ్యారు .