టీం ఇండియా కెప్టెన్ ,స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొన్నెండ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా వాళ్ళు ఇటలీ వెళ్లి మరి వివాహం చేసుకున్నారు .ఈ వివాహం చాలా రహస్యంగా జరిగింది .అతికొద్ది మంది సమక్షంలోనే వీరిద్దరి వివాహం జరిగింది .కానీ కోహ్లీ -అనుష్క వివాహం వెనక షాకింగ్ ట్విస్ట్ ఒకటి వెలుగులోకి వచ్చింది .
అదే ఏమిటి అంటే ఇండియాకు చెందిన ఒక పురోహితుడు దగ్గర ఉండి మరి వివాహం జరిపించాడు .పంజాబ్ రాష్ట్రానికి చెందిన కపుర్తల జిల్లా సాంధు చతా గ్రామానికి చెందిన పవన్ కుమార్ కౌశల్ అనే బ్రాహ్మణ వివాహం జరిపించాడు .ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏమిటి అంటే పవన్ కళ్యాణ వేదిక దగ్గరకు వెళ్ళేవరకు తను చేయబోయే వివాహం అనుష్క ,విరాట్ లదని తెలియదు అంట .
ఆయనే స్వయంగా ఈ విషయం తెలిపారు .సాధారణంగా ఒకరికి వివాహం చేయాలనీ పవన్ కు తెలిపారు .తీరా వెళ్ళినాక వీరిద్దర్నీ చూసి షాక్ కు గురవ్వడం ఆయన వంతైంది .దాదాపు ఒకటిన్నర రోజు పాటు చేసిన ఈ వివాహంతో గత ఇరవై ఐదు ఏండ్ల నుండి చేస్తోన్న పెళ్ళిళ్ళ వలన రాని పేరు ప్రఖ్యాతులు విరాట్ అనుష్క లతో వచ్చిందని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు ..