Home / MOVIES / సంక్రాతి బ‌రిలో దిగిన మూడు చిత్రాల్లో.. బాక్సాఫీస్ విన్న‌ర్ టైటిల్ ఎవ‌రికి ద‌క్కింది..?

సంక్రాతి బ‌రిలో దిగిన మూడు చిత్రాల్లో.. బాక్సాఫీస్ విన్న‌ర్ టైటిల్ ఎవ‌రికి ద‌క్కింది..?

తెలుగు సినీ అభిమానులకు 2017 సంక్రాంతి పండగ ఇచ్చినంత మ‌జాను.. గ‌త కొన్నేళ్ళ‌గా మరే పండగ ఇవ్వలేదనే చెప్పాలి. దానికి కారణాలు కూడా అంద‌రికీ తెలిసిందే. సంక్రాంతి బరిలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీనెం150, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టించిన ప్ర‌తిష్టాత్మ‌క 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, వంటి రెండు పెద్ద సినిమాలతో పాటు.. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, శర్వానంద్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శతమానం భవతి.. ఈ మూడు చిత్రాలు టాలీవుడ్ సంక్రాంతి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డిన విష‌యం తెలిసిందే. సంక్రాతి బ‌రిలో దిగిన ఈ మూడు సినిమాల ఫలితాలే వచ్చాయి.. అయితే ఏ సినిమా ఆధిపత్యం చలాయించింది.. బాక్సాఫీస్ వద్ద ఏ హీరో తన జెండాను ఎగురవేసాడు.. అన్నది సినీ ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారింది.. అనే విష‌యం పై ఒక‌సారి విశ్లేషిస్తే..

గ‌త రెండు ద‌శాబ్దాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్‌కా బాప్‌.. మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల విరామం తర్వాత నటించిన సినిమా ఖైదీ నెంబర్ 150. మంచి సామాజిక కథాంశం, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో విడుదలైన ఖైదీ నెంబర్ 150, అంచనాలకు తగ్గట్టు రాణించింది. సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి, మెగాస్టార్ కి ఇండస్ట్రీలోకి గ్రాండ్ వెల్కమ్ పలికింది. పరుచూరి బ్రదర్స్ మాటలు, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, వి.వి.వినాయక్ దర్శకత్వం, వీటన్నింటికీ మించి మెగాస్టార్ మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ తెలుగు ప్రేక్షకుల్ని కట్టేపడేశాయి. తమిళంలో సూపర్ హిట్ చిత్రం క‌త్తి సినిమా అంద‌రూ చూసినా.. రీమేక్‌గా వ‌చ్చిన ఖైదీనెం150 చిత్రం టాలీవుడ్‌లో కొత్త‌ రికార్డులు క్రియేట్ చేసింది. ఆయన ఎప్పుడెప్పుడు తెరపై కనిపిస్తాడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు, ఖైదీ నెంబర్ 150 మంచి ట్రీట్ గా నిలిచింది. అందుకే తెలుగు సినిమా అభిమానులు కూడా ఈ సినిమాకు ఘన విజయాన్ని కట్టబెట్టడంతో., 2017లో టాప్ ఫైవ్ మూవీస్ లో కూర్చోబెట్టారు.

ఇక మ‌రోచిత్రం నందమూరి బాలకృష్ణ నుండి వ‌చ్చిన ప్ర‌తిష్టాత్మ‌క 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. తెలుగువారి ఘనచరిత్రను వెలికితీసి, ఒక అద్భుతమైన సినిమాగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. తెలుగు వారి తొలి చక్రవర్తి అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి గురించిన వాస్తవాలు మరుగున పడుతున్న సమయంలో, తిరిగి ఆ ఘనచరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను వెలికితీసి, ఎంతో శ్రమించి, వాస్తవాలను, శాసనాలను గుర్తించి ఒక కథ రూపంలోకి తీసుకొచ్చి, చక్కని సినిమాగా తెరకెక్కించారు క్రిష్. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్న క్రిష్.. దాన్ని తన ల్యాండ్ మార్క్ సినిమాగా చేయడానికి సై అన్న నందమూరి బాలకృష్ణ.. ఇద్ద‌రినీ తప్పకుండా అభినందించాల్సిందే. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో చోటుచేసుకున్న చరిత్రను, వీలైనంత వాస్తవికంగా తెర పై ఆవిష్కరించడంలో క్రిష్ అండ్ టీమ్ చాలా వ‌ర‌కు సక్సెస్ అయ్యారు. అనేక రాజ్యాలుగా పడి ఉన్న భారతదేశాన్ని, ఏకతాటిపైకి తీసుకురావాలనే ఆశయంతో గౌతమీ పుత్ర శాతకర్ణి నడిపిన యుద్ధాలు, వీరోచిత పోరాటాల్ని కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించారు. అది త‌క్కువ కాలంలోనే తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాతికి విడుద‌లైన ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించింది.సాధారణ అభిమానులకు కూడా ఈ సినిమా మంచి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించి 2017లో టాప్ 5 సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

ఇక సంక్రాతి బ‌రిలో మ‌రోచిత్రం దిగింది. కుటుంబ క‌థా చిత్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నుండి వ‌చ్చిన మ‌రో చిత్రం శ‌త‌మానంభ‌వ‌తి. నిండైన తెలుగుదనం ఉట్టిపడే సినిమా వచ్చి చాలా ఏళ్లైపోయింది. కుటుంబమంతా కలిసి కూర్చుని చూస్తూ హాయిగా నవ్వుకుంటూ, మనదైన తెలుగు సంస్కృతిని చూస్తూ ఆనందించే సినిమా రావాలని కోరుకున్న తెలుగు ప్రేక్షకులందరికీ సమాధానంగా వచ్చింది శతమానంభవతి సినిమా. పల్లెటూర్లో ఉండే ఒక సాదాసీదా త‌ల్లి దండ్రులు.. రెక్క‌లొచ్చాక ఎగిరిపోగా.. వారు తిరిగి ఎప్పుడొస్తార‌ని.. క‌ళ్ళు కాయ‌లు కాచేవిధంగా చూస్తున్న క‌న్న‌వారి క‌థే.. ఈ శ‌త‌మానంభ‌వ‌తి చిత్రం అస‌లు మూల క‌థ‌. నేటికీ చాలా గ్రామాల్లో ఉన్న పరిస్థితిని తీసుకుని, దానికి ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామాను జతకలిపి తెరకెక్కించాడు డైరెక్టర్ సతీష్ వేగేశ్న. చాలామంది తమను తాము ఈ సినిమాతో రిలేట్ చేసుకుని చూసుకున్నారు. ఇక శర్వానంద్ లాంటి యువహీరో సైతం ఇలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రావడం మంచి పరిణామంగా చెప్పుకోవాలి. ప్రకాష్ రాజ్, జయసుధ ల నటన ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మిక్కీ జే మేయర్ మనసుకు ఇంపైన సంగీతాన్ని సమకూర్చాడు. అచ్చమైన పల్లెటూరి సినిమా చూసి చాలా కాలమైన తెలుగు ప్రేక్షకులకు శతమానం భవతి అద్భుతంగా నచ్చేసింది. ఎక్కడా అశ్లీలత లేకుండా, క్లీన్ సినిమాగా తెరకెక్కిన శతమానం భవతిని దీవించి 2017లో టాప్ 5 సినిమాల్లో చోటు కల్పించేశారు.

ఇక ఈ మూడు చిత్రాలు వేటిక‌వే ప్ర‌త్యేకంగా ఉన్నా మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా.. సినీ ట్రేడ్ పండితులు సంక్రాంతి విన్న‌ర్ టైటిల్ ఎవ‌రికి క‌ట్ట‌బెట్టారు.. మొద‌ట సంక్రాతి బ‌రిలో దిగిన చిరు.. 150వ చిత్రం ఖైదీ నెం 150, బాలయ్య 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల చుట్టే తిరిగింది. ఈ రెండు భారీ చిత్రాలతో పోటీ పడుతూ అండర్ డాగ్ లాగా బరిలోకి దిగిన శతమానం భవతి చిత్రం ఊహించని కలెక్షన్లతో దూసుకెళ్ళింది. ట్రేడ్ పండితులంతా అసలు సిసలైన సంక్రాంతి విన్నర్ మెగాస్టార్ నటించిన ఖైదీ నెం 150 చిత్రాన్ని.. బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాని కాద‌ని .. దిల్ రాజు , శర్వానంద్, స‌తీష్ వేగ్నేశ‌ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శ‌తమానం భవతి చిత్రాన్నే బాక్సాఫీస్ విన్న‌ర్ అని తేల్చేశారు. కేవలం సంక్రాంతి విన్నర్ అనే పేరు సంపాదించుకోవడం మాత్రమే కాదు… చిన్న బడ్జెట్ చిత్రాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా ఈ చిత్రం సరికొత్త రికార్డు నెలకొల్పిందని.. ఒక చిన్న సినిమాగా వచ్చి… రెండు పెద్ద సినిమాలతో పోటీ పడుతూ ఇలాంటి ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించడం విశేషం. సినిమాలో ఫ్యామిలీ కంటెంట్ ఉండటంతో రిలీజ్ విషయంలో నిర్మాత దిల్ రాజు స్ట్రాటజీ కూడా సినిమా సంక్రాంతి బరిలో విన్ అవ్వడానికి దోహదం చేసాయని విశ్లేష‌కులు స‌ర్టిఫికేట్ ఇచ్చారు. ఇదండీ 2017 టాలీవుడ్ బాక్సాఫీస్ విన్న‌ర్ క‌థ‌.. ఇక‌ త్వ‌ర‌లో రానున్న 2018 బాక్సాఫీస్ వ‌ద్ద కూడా అనేక చిత్రాలు పోటీప‌డ‌నున్నాయి.. మ‌రి వ‌చ్చే సంక్రాతి బాక్సాఫీస్‌ విన్న‌ర్‌గా ఎవ‌రు నిలువ నున్నారో..

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat