ఏపీలోని కర్నూల్ జిల్లాలో దారుణ హత్యలు జరుగుతున్నాయి. ఫ్యాక్షన్ తో రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీనేతను కత్తితో పొడిచిన సంఘటన జిల్లాలోని పాణ్యంలో చోటుచేసుకుంది.. నిధుల విషయంలో ఏర్పడ్డ విభేదాలతో టీడీపీ జిల్లా నాయకుడు పుల్లారెడ్డిని కత్తితో దాడి చేసారు బీజేపీ నాయకుడు సుబ్బారాయుడు.. దీంతో పుల్లారెడ్డికి గాయాలు కాగా ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.. ఈ నేపథ్యంలో కత్తితో దాడి చేసిన సుబ్బారాయుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.. ఇదిలావుంటే ఐటిడిఏ నిధుల విషయంలో వీరిద్దరి మధ్య ఏర్పడ్డ తగాదాలు కత్తులతోదాడి చేసుకోవడం వరకు వెళ్లాయి..