తెలంగాణ జాక్ చైర్మన్ కోదండరాం త్వరలో సరికొత్త రాజకీయ పెట్టనున్నారా ..?.ఇటివల అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వి ప్రకాష్ ఆరోపించినట్లుగా కోదండరాం ఇప్పటికే కేంద్ర ఎలక్షన్ కమీషన్ దగ్గర పార్టీ పేరు కూడా రిజిస్ట్రేషన్ చేయించారా ..?.అంటే అవును అనే అంటున్నాయి రాష్ట్ర పొలిటికల్ వర్గాలు .
అసలు విషయానికి తెలంగాణ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరిన సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి త్వరలోనే పార్టీ మారనున్నారు అని వార్తలు వస్తున్నాయి .అయితే అందులో భాగంగా నాగం ను జాక్ తమ కొత్త పార్టీలోకి ఆహ్వానించారు అని సమాచారం .అందులో భాగంగా సరికొత్త పార్టీ గురించి ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ దగ్గర రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా ముగిశాయి .
ఇదే అంశం మీద జాక్ చైర్మన్ కోదండరాం నాగం జనార్ధన్ రెడ్డితో రహస్యంగా భేటీ కూడా జరిపారు .అయితే కొత్త పార్టీకి గుర్తింపు రావడం ..పని చేయడం చాలా ఆలస్యమవుతుంది కాబట్టి టీఎస్ జేపీ పేరిట కల్సి నడుద్దాం అని నాగం సూచించారు .దీంతో కోదండరాం తన తర్వాత రెండో స్థానాన్ని ఇస్తాను హామీ ఇచ్చారు .దీంతో నాగం కోడండరాం తో కల్సి సరికొత్త రాజకీయ పార్టీ అవతారమేత్తనున్నారు అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో టాక్ .చూడాలి మరి నాగం ఎటువైపు చూస్తారో ..