ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని పవన్ కల్యాణ్ కోరుకుంటుంటే.. జగన్ మాత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుపడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు మంత్రి లోకేష్.
అయితే, ఇటీవల పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పొలిటికల్ వారసుల గురించి మాట్లాడుతూ.. పొలిటికల్ వారసులు తమ సత్తాను నిరూపించుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందించిన నారా లోకేష్.. సరిగ్గా పనిచేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారని, వారసత్వంగా అవకాశం వచ్చింది. మేము నిలబెట్టుకోవాలని కదా..? అంటూ అది రేపటి రోజున మాకు ఓటు వేయదు కదా..! అన్నారు మంత్రి నారా లోకేష్.
మరో వైపు, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజల నడుమ పాదయాత్ర చేస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ.. సమస్యల పరిష్కారానికి ఆచరణాత్మక ప్రణాళికలను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.