ఏపీలో 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అమలు కాని హామీలను గుప్పించి.. అడ్డదారులు తొక్కి ఆంధ్రప్రదేశ్‌లోఅధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో కనీ వినీ ఎరుగని రీతిలో ఘోర ఓటమి తప్పేట్టు లేదని ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సగానికి పైగా తెలుగు తమ్ముళ్లు బోల్తా కొట్టడం ఖాయమని.. అంతే కాకుండా చంద్రబాబు క్యాబినేట్‌లో ఉన్న మంత్రులు కూడా పెద్ద సంఖ్యలో పరాజయం పొందుతారనినే విషయం టీడీపీ వర్గీయుల్లో పెద్ద రచ్చకి తెరలేపింది. అసలు విషయం ఏంటంటే టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలు.. మంత్రుల పని తీరు పై సర్వే చేయించారట. ఇక ఆ సర్వే రిజల్ట్ చూసిన చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యిందట.
ఇప్పటికే పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉందని.. తమ నేతలంతా పనిమంతులని.. మైక్ పట్టుకున్నప్పుడల్లా డబ్బా కొడుతున్న చంద్రబాబుకు.. తాజా సర్వేలో అసలు నిజాలు బయట పడడంతో బాబు గారికి మింగుడు పడడం లేదట. ఆ సర్వేలో ఏపీలో ప్రతి నియోజక వర్గంలో.. టీడీపీ నేతల పై వ్యతిరేకత వచ్చేసిందని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుండి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయమని ఆ సర్వే తేల్చేసింది. అంతే కాకుండా ప్రజలు సంతృప్తిగా ఉన్న టీడీపీ నేతల్లో 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని ఆ సర్వేలో తేలింది. ఇక 26 మంది మంత్రుల్లో 8 మంది మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయని.. ఆ సర్వేలో రిపోర్టులో తేలింది. అయితే ఈ సర్వే రిజల్ట్‌ని గోప్యంగా ఉంచాలనుకున్న ఎల్లో గ్యాంగ్… తాజాగా బయటకి వచ్చి సోషల్ మీడియాలో హాల్‌చల్ చేయడంతో చంద్రబాబు అండ్ బ్యాచ్ మొత్తం ఒక్కసారిగా ఖంగుతిన్నారని సమాచారం.