ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజాకి అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుండి బంపర్ ఆఫర్ వచ్చింది .ఒక ప్రముఖ మీడియాకి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు .ఆ ఇంటర్వ్యూ లో ఆమె పలు ఆసక్తికర విషయాలను తెలిపారు.
ఇంటర్వ్యూ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ తను టీడీపీ పార్టీలో నుండి బయటకు రావడానికి గల కారణాన్ని తెలిపారు .టీడీపీ పార్టీలో ఉన్న సమయంలో ఒక అసెంబ్లీ స్థానం అంటూ కేటాయించకుండా ఏదో మొక్కుబడిగా నగరి లేదా చంద్రగిరి ఇలా పలు నియోజక వర్గాల పేర్లు చెబుతూ పోటి చేయాలనీ చంద్రబాబు తీవ్ర ఒత్తిడి తెచ్చేవారు .
ఎన్నికలు అన్నప్పుడు ప్రజలు ఎక్కడ తనలాంటి నాయకురాల్ని కావాలని కోరుకుంటారో అక్కడ నిలబడాలి కానీ అధిష్టానం చూయించినట్లుగా ఓడిపోయే సెగ్మెంట్ లో నిలబడితే ఎలా అని ..బాబుకు సూచించాను అయిన ఆయన వినలేదు .అంతే కాకుండా నన్ను కరివేపాకులా వాడుకోవాలని చూశారు .అంతే కాకుండా పార్టీలో మహిళలకు సరైన గౌరవం లేదు .అందుకే టీడీపీ పార్టీను వీడాల్సి వచ్చింది అని ఆమె అన్నారు .అంతే కాకుండా టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాను .ఇటివల జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు ఒకరి ద్వారా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ..టీడీపీలో చేరాలి .చేరితే మంచి అవకాశం ఇస్తామని ఆఫర్ చేశారు .సమయం వచ్చినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడతాను అని ఆమె తెలిపారు ..