తెలంగాణలో తెలుగు భాషా చరిత్రను తిరుగరాసే లక్ష్యంతో, మరుగునపడిన తెలుగు భాష, సాహితీమూర్తులు, చరిత్ర, తెలంగాణ సాహిత్యం, కవులు, కళాకారులు, సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15 నుండి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని లాల్ బహదూర్ స్టేడియం లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాషా ప్రియులందరికీ ఆహ్వానాలు అందాయి..కాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాత్రం అందలేదు.ఈ నేపధ్యంలో దీనికి సంబంధించిన పూర్తి విషయం తెలియాల్సివుంది