ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, కర్నూల్ జిల్లా డోన్ నియోజకవర్గ శాసన సభ్యుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరో సారి చంద్రబాబు సర్కార్‌పై మండిపడ్డారు. ఎప్పుడూ విదేశీ పర్యటనలంటూ తిరుగుతున్న చంద్రబాబు.. రాష్ట్ర అభివృద్ధి మరుగున పడినా పట్టించుకోవడం లేదన్నారు. తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందు కేంద్రంతో రాజీపడుతూ ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులను పక్కదారి పట్టిస్తూ.. ప్రజలపై అదనపు భారంపడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు.
విదేశాల నుంచి ముఖ్యమంత్రి గడ్కరీతో మాట్లాడినట్లు చెప్పుకుంటున్న చంద్రబాబు ఏం సాధించారో ప్రజలకు చెప్పాలన్నారు. మీరు కొరియా నుంచి అయినా.. సింగపూర్ నుంచి అయినా మాట్లాడండి.. అయితే, ఆ పని వల్ల ఏం ఒరిగిందో ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు సర్కార్‌కు వంతపాడే పత్రికలు.. చంద్రబాబు ఇప్పటి వరకు 37 సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించారని, నీటిపారుదలశాఖ మంత్రి 47 సార్లు పోలవరాన్ని సందర్శించారని రాస్తున్నారని, కేవలం సందర్శిస్తే పోలవరం పూర్తి కాదని, పనులు చేస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని అన్నారు.
కేంద్రం వెంటపడి పోలవరం ప్రాజెక్టు పనులు చేయించాల్సింది పోయి, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 16వేల కోట్ల వ్యయం దాటితే.. ఆ మొత్తాన్ని మేమే భరిస్తామంటూ చెప్పి కేంద్ర ప్రభుత్వంతో రాజీ ఎందుకు కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు అదనపు వ్యయం 58వేల కోట్లు పెరిగిందన్నారు. ఈ ఖర్చునంతా భరించాల్సింది ప్రజలే కదా..? అసలు మీరు చేసిన తప్పులకు ప్రజలు ఎందుకు బాధ్యత వహించాలి అంటూ చంద్రబాబు సర్కార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు బుగ్జన రాజేంద్రనాథ్‌రెడ్డి.