షార్జా వేదికగా జరుగుతున్న ట్వంటీ ట్వంటీ లీగ్ లో పాకిస్తాన్ మాజీ సీనియర్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది సంచలనం సృష్టించాడు .అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ లీగ్ లో మొదటి మ్యాచ్ లోనే ఆఫ్రిది రికార్డు సృష్టించడం మరో విశేషం .నిన్న గురువారం మరాఠా అరేబియన్స్ ,పక్తూన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్రిది సారథ్యంలో పక్తూన్స్ పది ఓవర్లకు నాలుగు వికెట్లను కోల్పోయి నూట ఇరవై ఒక్క పరుగులు మాత్రమే చేసింది .
దీంతో తర్వాత రెండో ఇన్నింగ్స్ కు దిగిన సెహ్వాగ్ నేతృత్వంలో అరేబియన్స్ నాలుగు ఓవర్లకే రెండు వికెట్ల నష్టానికి నలబై ఆరు పరుగులు మాత్రమే చేసింది .ఆ తర్వాత రంగంలో దిగిన ఆఫ్రిది దాటికి వరసగా రోసో(5) ,డ్వేన్ బ్రావో (0),సెహ్వాగ్ (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు .అయితే అలెక్స్ హెలీ ఇరవై ఆరు బంతుల్లో యాబై ఏడు పరుగులు (5*4,4*6) సాధించిన కానీ మరాఠా జట్టు మొత్తం ఓవర్లు ఆడి ఏడు వికెట్లను కోల్పోయి తొంబై ఆరు పరుగులు చేసి ఓటమి పాలైంది ..