సోనియాగాంధీ ..మొత్తం పంతొమ్మిది ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు .అంతే కాకుండా రెండు సార్లు కొన్ని రాష్ట్రాల్లో ..కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతగానో కృషి చేశారు .సరిగ్గా ఇరవై యేండ్ల కింద రాజకీయ ఎంట్రీచ్చిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా పదవీ బాధ్యతలను చేపట్టారు .
అప్పటి నుండి నేటివరకు ఆమె అదే పదవిలో ఉన్నారు .తను పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బళ్ళారి ,అమేథి నుండి పోటి చేశారు .రెండు స్థానాల్లో గెలిచిన సోనియా అమేథిని మాత్రమే సొంత నియోజకవర్గంగా భావించారు .ఆ తర్వాత 2004 వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు .
2004 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆమె తీవ్రంగా కృషి చేశారు .ఆ తర్వాత 2009 లో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు .2 004 నుండి 2014 వరకు యూపీఏ చైర్ పర్శన్ గా ఆమె వ్యవహరించారు ..