ఏపీ రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీలో పార్టీ చేరిన సంగతి తెల్సిందే .మరికొంతమంది వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆస్థాన మీడియాకు ముద్రపడిన తెలుగు మీడియాకి చెందిన పద్నాలుగు ఛానల్స్ లో రోజుకో ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తున్నాయి .
ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు టీడీపీలో చేరడంతో నిరుత్సాహంగా ఉన్న ఆ పార్టీ శ్రేణులకు ఊపోచ్చే వార్త ఒకటి ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది .అప్పటి ఉమ్మడి ఏపీ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు ..ఆయనకు ఆత్మగా వ్యవహరించిన కేవీపీ రామచంద్రరావు త్వరలోనే వైసీపీలో చేరనున్నారు .ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర తరపున ఎంపీ(రాజ్యసభ సభ్యుడి)గా ఉన్న ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చి నెలతో ముగియనున్నది .దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుకోసం వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం .
గతంలోనే వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ,ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి కేవీపీని పార్టీలో ఆహ్వానించిన సమయంలో ఎంపీ పదవీలో ఉండటం ప్రస్తుతం రాష్ట్రానికి చాలా అవసరం ..విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు ,అమలు చేయాల్సిన హామీలపై ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది .ఎంపీ పదవీ కాలం ముగిసిన తర్వాత వస్తాను .పార్టీకి సలహాదారుడిగా నా సేవలు అందిస్తాను అని హామీ ఇచ్చారు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి .అయితే తాజాగా ఆయన మార్చి నెల తర్వాత వైసీపీలో చేరి జగన్ కు అండగా ఉంటారని మరోసారి వార్తలు వస్తున్నాయి ..