జగన్ చేపట్టిన పాదయాత్ర అనంతపురం జిల్లాలో దుమ్మురేపుతోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతలో చాలా ఏళ్ళగా పరిటాల హావా కొనసాగుతోంది. దీంతో అక్కడ టీడీపీ ఆధిపత్యాన్ని బ్రేక్ చేయాడానికి వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇక ఈ నేపధ్యంలో జగన్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో రాప్తాడు ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. అనంతో పరిటాల కుటుంబం చేస్తున్న దాడులకు.. దౌర్జన్యాలకు భయపడే ప్రశక్తే లేదని ఫైర్ అయ్యారు.
పరిటాల సునీత ఇంట్లో కట్టలు కట్టలుగా డబ్బు ఉంటే ప్రజలందరి దగ్గర కూడా అలాగే డబ్బులుంటాయని భావిస్తోందన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలోనే అనంతపురం అద్భుతంగా ఉందని, మంచి రోజులు ఉండేవని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో అనంతపురాన్ని భ్రష్టుపట్టించారని, అసలు పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. పరిటాల కుటుంబం ఫ్యాక్షన్‌ను ధైర్యంగా ఎదుర్కొంటామని ప్రకాష్ రెడ్డి అన్నారు.
ఇక తాను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసిన తర్వాతే తన తుది శ్వాస విడుస్తానని అన్నారు. మహానేత వైయస్ ఈ జిల్లాకు నీరు తెచ్చేందుకు ప్రాజెక్టులు కడితే ఎక్కడ ఆయనకు పేరు వస్తుందో అని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక కనీసం పిల్ల కాల్వలు కూడా తవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తి చేశారు. తినడానికి తిండి లేక విశ్వనాథరెడ్డి అనే సర్పంచ్ బెంగుళూరులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారని.. అధికార టీడీపీ పార్టీ నేతలకు ఇవేమి కనిపించవని.. అసలు పరిటాల సునీత ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ది చేసారని ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.