పరిటాల సునీత ..ఏపీలో అనంతపురం జిల్లాకు చెందిన రాప్తాడు అసెంబ్లీ నియోజక వర్గం నుండి టీడీపీ తరపున గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు .జిల్లా రాజకీయాల్లో పరిటాల వర్గం హవా ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెల్సిందే .తాజాగా ఆమె రాజకీయ ఆధిపత్యానికి చెక్ పెట్టేవిధంగా ఒక మహిళ నాయకురాలు వైసీపీలో చేరనున్నారు .
రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న వస్తున్న మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి వైసీపీలోకి వస్తున్నాను అని తేల్చి చెప్పారు .వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు .పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్నారు .
ఈ క్రమంలో జిల్లాలో మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గానికి వచ్చిన సమయంలో భానుమతి జగన్ ను కలిశారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని కారణాల వలన ప్రత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నాను .దాదాపు నాలుగు యేండ్ల ద్వారా మరల ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తాను .రాప్తాడు నియోజక వర్గంలో టి ప్రకాష్ రెడ్డి గెలుపుకోసం కృషి చేస్తాను .వైసీపీ పార్టీ శ్రేణులకు ,అభిమానులకు అండగా ఉంటాను అని ఆమె తేల్చి చెప్పారు .చూడాలి మరి భానుమతి చేరికతో వైసీపీ దశ దిశ మారుతుందేమో ..?