ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్రంలో నేడు రెండో దశ పోలింగ్ జరుగుతున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే ముగిసిన తొలిదశ పోలింగ్ లో మొత్తం అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదు అయింది .తొలిదశలో మొత్తం ఎనబై తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.రెండో దశలో మిగిలిన తొంబై మూడు స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది .ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎనిమిది వందల యాబై ఒకటి మంది అభ్యర్ధులు పోటి చేస్తున్నారు .
రాష్ట్రంలో నాలుగు కోట్ల ముప్పై అది లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు .అయితే గుజరాత్ ఎన్నికలను రానున్న పార్లమెంటు ఎన్నికల సమరానికి శంఖారావంగా ఇటు ప్రధాని మోదీ ,అటు రాహుల్ గాంధీ భావిస్తున్నారు .అందులో భాగంగా సీ ఓటర్ నిర్వహించిన సర్వే లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ పార్టీ మొత్తం నూట యాబై సీట్లను గెలవలేదని ..కేవలం వంద స్థానాలను మాత్రమే గెలుస్తుంది అని తేల్చేసింది .
అయితే ఆ పార్టీ కన్నేసినట్లు 150 సీట్లు గెలవలేదని 110 సీట్లు ..కాంగ్రెస్ పార్టీ డెబ్బై స్థానాలను దక్కించుకుంటుందని అంటున్నారు. కాంగ్రెస్ ఈ దఫా బలోపేతం అవుతుందని సర్వేలు చెప్తున్నాయి. మరో జాతీయ మీడియా ఛానల్ అయిన టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే లో బీజేపీ నూట ఆరు నుండి నూట పదహారు స్థానాలను గెలుస్తుంది .కాంగ్రెస్ పార్టీకి తొంబై ఒక్కటి నుండి తొంబై ఆరు స్థానాలను గెలుచుకుంటుంది అని తెలిపింది .సీఓటర్ -టీవీ9 సర్వేలో బీజేపీ పార్టీకి 109,లోక్ నీతి -సీఎస్ డీఎస్-ఏబీపీ ప్రకారం తొంబై ఒక్కటి నుండి తొంబై తొమ్మిది స్థానాలు వస్తాయి అని తేలింది .ఓవరాల్ గా చూసుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది అని పలు సర్వేలు చెబుతున్నాయి అన్నమాట .డిసెంబర్ 18వరకు వేచి చూడాలి ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారో ..?.