Home / MOVIES / పోలీసుల చేతిలో బలమైన కారణం…విజయ్ సాయి భార్య వనిత అరెస్టు..!

పోలీసుల చేతిలో బలమైన కారణం…విజయ్ సాయి భార్య వనిత అరెస్టు..!

ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి కేసులో ఆయన భార్య వనితా రెడ్డి అరెస్టుకు హైదరాబాద్ నగర పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు ఆమె తరపు న్యాయవాదిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే, వీరిద్దరు కలిసి వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు గట్టిగా భావిస్తున్నారు.

ముఖ్యంగా, విడాకుల కేసు కోర్టులో విచారణ సాగుతుండగానే న్యాయవాది ఎందుకంత ఉత్సాహం చూపాడనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కేసు కోర్టు పరిధిలో ఉండగానే రూ.3 కోట్ల భరణం ఇస్తే సెటిల్మెంట్‌ చేస్తానని చెప్పడం వెనుక రహస్యం ఏమిటని ఆరా తీస్తున్నారు. కేసుతో నిమిత్తం లేకుండా విజయ్‌కు సంబంధించిన కొన్ని పర్సనల్‌ వీడియోలు న్యాయవాది వద్ద ఉన్నాయని, వాటితో అతడు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి ఉంటాడనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అదేసమయంలో విజయ్‌ చనిపోతూ తీసిన సెల్ఫీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చివరకు ఇదే సాక్ష్యంగా మారుతుందని చెబుతున్నారు. భార్య వనిత, న్యాయవాది శ్రీనివాస్‌ వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, వారు తనను మానసికంగా హింసించారని అందులో విజయ్‌సాయి ఆవేదన వ్యక్తంచేశారు. ‘డాడీ! ఎవ్వర్నీ విడిచిపెట్టొద్దు. అందరికీ శిక్ష పడేలా చూడు. లవ్‌యూ డాడీ. నా కూతురు అలాంటి వాతావరణంలో పెరగడం నాకిష్టం లేదు. వెంటనే తీసుకొచ్చేయండి డాడీ’ అంటూ విజయ్ తన సెల్ఫీ వీడియోలో ప్రాధేయపడిన విషయం తెల్సిందే. మరోవైపు, మంగళవారం జరిగిన విజయ్ సాయి అంత్యక్రియలకు భార్య వనితా రెడ్డి హాజరుకాలేదు. విజయ్ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులంతా హాజరయ్యారు. దీంతో ఖచ్చితంగా విజయ్ ఆత్మహత్యకు భార్య వేధింపులే కారణమైన ఉంటాయని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat