తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ సీనియర్ మంత్రి ఉమా మాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్ రెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేసి ..నేడు గురువారం ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ భవన్ లో గూలాబీ కండువా కప్పుకున్నారు .
ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ “టీఆర్ఎస్ పార్టీలోకి రావడం నా పుట్టింటికి వచ్చినట్లు ఉంది .టీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది .అయితే పార్టీలో చేరడానికి నేను ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు .ఏమి పదవులు కూడా అడగలేదు .కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించడానికి మాత్రమే పార్టీ మారాను..ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందనే హామీ ఇచ్చారు అని ఆమె తెలిపారు ..