Home / ANDHRAPRADESH / వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ ఎంట్రీ పై.. టీడీపీ సీనియ‌ర్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ ఎమ్మెల్యే రోజా సినీ ఎంట్రీ పై.. టీడీపీ సీనియ‌ర్ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి.. ఆ త‌ర్వా రాజకీయాల్లోకి వ‌చ్చి అంచెలంచెలుగా ఎదిగి.. ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా త‌న‌కంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ముఖ పాత్ర‌ని పోషిస్తున్నారు. అయితే తాజాగా రోజా లైఫ్‌కి సంబందించి ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు విష‌యం ఏంటంటే.. చిత్తూరు టీడీపీ ఎంపీ శివ‌ప్ర‌సాద్ రోజా గురించి కొన్ని ఆశ‌క్తిక‌ర విష‌యాలు చెప్పి టాక్ ఆఫ్‌ది సోష‌ల్ మీడియా అయ్యారు.

ప్రస్తుతం రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న‌ రోజాకి ధైర్యం చాలా ఎక్కువ‌ని.. ఆమె మాటతీరే వేర‌ని… ఆమె జోలికి వెళ్లాలంటే మగాళ్లు సైతం వణికిపోవాల్సిందేన‌ని.. శివప్రసాద్ వెల్లడించారు. అస‌లు రోజా తొలి సినిమా ఎంట్రీ ఎలా జ‌రిగిందంటే.. 1991లో ప్రేమతపస్సు సినిమాని ప్రారంభించామ‌ని.. అయితే ఆ చిత్రంలో హీరోయిన్‌గా ఒక కొత్త ముఖాన్ని ప‌రిచ‌యం చేయాల‌ని.. ఆరు నెల‌ల పాటు.. అనేక‌ చోట్ల తిరిగామ‌ని.. ఫైనల్‌గా శ్రీలత అనే అమ్మాయిని సెలెక్ట్ చేశామ‌ని చెప్పారు. ఇక‌ ఆ తర్వాత ఆమె పేరును రోజాగా మార్చి ఆ చిత్రంతో వెండితెరకు పరిచయం చేశామ‌ని.. ఆ రోజుల్లోనే రోజాకి ట్రైనింగ్‌ ఇచ్చి అన్నీ పర్‌ఫెక్ట్‌గా నేర్పించామ‌ని… ఒక బాధ్యతగా తీసుకుని రోజాని హీరోయిన్‌గా ప్రెజెంట్ చేశామ‌ని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ చిత్రంలోనే నిర్మాత పోకూరి బాబూరావుని కూడా విలన్‌గా పరిచయం చేశామ‌ని అన్నారు. దీంతో రోజా సినీ ఎంట్రీ మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో హాల్‌చ‌ల్ చేస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat