నాగర్ కర్నూలులో సంచలనం రేపిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో.. ఆయన భార్య స్వాతి ప్రియుడు అసలు నిజాలు చెప్పాడు. ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను కడతేర్చడమే కాకుండా అతని స్థానంలో ప్రియుడిని తీసుకురావడానికి విఫలయత్నం చేసిన ఇల్లాలు స్వాతి కథ అందరికీ తెలిసిందే. భర్త పట్టించుకోవడంలేదంటూ.. అడ్డదారులు తొక్కిన స్వాతి.. పచ్చని సంసారంలో మంట పెట్టుకుంది. అటు భర్తను హతమార్చి.. ఇటు ఆమె కటకటాల వెనక్కి వెళ్లి ఇద్దరు పిల్లల్ని అనాథలను చేసింది. స్వాతి పిల్లల బాధ్యత తానే తీసుకుంటానని ఆమె తండ్రి లింగారెడ్డి చెప్పినప్పటికీ తల్లిదండ్రులు లేని లోటు వారికి తీర్చలేనిదే. అయితే పిల్లల కోసమే స్వాతి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు రాజేష్ పోలీసులకు వెల్లడించాడు.
గత రెండేళ్లుగా తనకు స్వాతి అక్రమ సంబంధం నడుస్తోందని.. భర్త అంటే తనకు ఇష్టం లేదని, తనతో ఉండాలనుకుంటన్నట్టు అతనికి పదేపదే చెప్పేదని… ఈ క్రమంలో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామ అడగ్గా.. అందుకు స్వాతి నిరాకరించిందని.. పిల్లలను వదిలిపెట్టి తాను ఉండలేనని, నీతోపాటు పిల్లలు కూడా కావాలని రాజేష్‌కు చెప్పేదని అన్నాడు. భర్త అడ్డు తొలగించుకుంటే పిల్లలతో కలసి తామిద్దరం కలిసి హాయిగా జీవితం గడుపుదామని రాజేష్‌కు సూచించిందని తెల్పాడు. ఈ క్రమంలో స్వాతి, రాజేష్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అనుకున్నట్టే సుధాకర్‌రెడ్డిని హత్యచేశారని ఒప్పేసుకున్నాడు.
ఇక పధకం ప్రకారమే.. రాజేష్ తన ముఖం పై పెట్రోల్ పోసుకుని పెద్దగా ప్రమాదం జరగని విధంగా కాల్చుకుని… తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పుణేకు మకాం మారుద్దామని అనుకొనగా… అయితే కథ అడ్డం తిరిగి.. స్వాతి బండారం బయటపడిపోయింది. రాజేష్ ఆహారపు అలవాట్లపై వచ్చిన తొలి అనుమానంతో బట్టబయలు కాగా.. చికిత్స పొందుతున్నది సుధాకర్‌రెడ్డి కాదని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించి… పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్వాతిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు రాజేష్ గాయాలు మానిపోయినప్పటికీ అతని కుటుంబ సభ్యులు ఎవరూ రాకపోవడంతో డిశ్చార్జ్ చేయలేదు. మొత్తానికి పోలీసుల చొరవతో గురువారం ఉదయం అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రి నుంచి రాజేష్ డిశ్చార్జ్ అయ్యాడు. అస్పత్రిలోనే అతన్ని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. రాజేష్‌ను ఎ1 నిందితుడిగా చేర్చారు. ఇదండీ స్వాతీ ప్రేమ కథా చిత్రం.