Home / First time in tollywood / సాహో అనిపించే శ్రద్ధా కపూర్ తెరవెనుక కథ
Shraddha-Kapoor-spectacles

సాహో అనిపించే శ్రద్ధా కపూర్ తెరవెనుక కథ

ప్రభాస్ సాహో సినిమాలో కథా నాయికగా శ్రద్ధా కపూర్ ఎంపికైనప్పటి నుంచి ప్రేక్షకులకు ఎవరా ఈమె అనే ఆసక్తి మొదలైంది. హింది సినిమాలు రెగ్యులర్ గా చూసే అలవాటు ఉన్నవాళ్ళకు తను సుపరిచితురాలే కాని మిగిలినవాళ్ళకు మాత్రం తానో కొత్తమ్మాయి. మరి తన గురించి పలు ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 90 దశకంలో తన క్రూరమైన విలనీ ద్వారా అమ్రిష్ పూరి లాంటి దిగ్గజాలకు కూడా పోటీ ఇచ్చిన నటుడు శక్తి కపూర్. అతని గారాల తనయే ఈ శ్రద్ధా కపూర్. శక్తి కపూర్ ది పంజాబీ నేపధ్యం కాగా తల్లి శివాంగి కపూర్ ది మరాఠీ నేపధ్యం. అన్నయ్య సిద్ధాంత్ కపూర్ కూడా ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. పాపులర్ నటీమణులైన పద్మిని కొల్హపురి, తేజస్విని కొల్హపూరి, గాయనీమణులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే వీళ్ళంతా తనకు దగ్గరి చుట్టాలే.

చిన్నప్పటి నుంచే నటన మీద మక్కువ పెంచుకున్న శ్రద్ధా కపూర్ నాన్నతో కలిసి షూటింగ్ కు వెళ్ళినప్పుడంతా అక్కడ జరిగేది మొత్తం ఎంతో ఆసక్తిగా గమనించేది. అమ్మానాన్నల డ్రెస్ రిహార్సల్ వేసుకుని మురిసిపోయేది. జన్నాబై నర్సీ స్కూల్ లో తన బాల్యం గడిపిన శ్రద్ధా కపూర్ కాలేజీ చదువు మాత్రం అమెరికన్ స్కూల్ అఫ్ బొంబాయిలో కొనసాగించింది. ఆదిత్య శెట్టి. టైగర్ ష్రాఫ్ తన క్లాస్ మేట్స్. వీళ్ళంతా కాలేజీ లైఫ్ లో స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ లో పోటాపోటీగా పాల్గొనే వాళ్ళు. శ్రద్ధా, టైగర్ ష్రాఫ్ లకు కాలేజీ లైఫ్ లోనే ఒకరిమీద ఒకరికి ఇష్టం ఉన్నప్పటికీ అది బయట పెట్టుకునే ప్రయత్నం చేయలేదని లాస్ట్ ఇయర్ హిందూస్తాన్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒప్పుకున్నారు.

తరువాత బోస్టన్ యూనివర్సిటీ లో సైకాలజీ డిగ్రీ కోసం చేరిన శ్రద్ధా అది ఎక్కువ కాలం కొనసాగించలేక తన మొదటి సినిమా తీన్ పత్తి కోసం ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఫేస్ బుక్ లో తన ఫోటోలు చూసిన తీన్ పత్తి నిర్మాత అంబిక హిందూజా తనను పిలిపించింది. నిజానికి శ్రద్ధ కపూర్ కు 16 ఏళ్ళ వయసులోనే సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. చదువు పాడవుతుందనే ఉద్దేశంతో నాన్న శక్తి కపూర్ వద్దు అనేసాడు. కాని బోస్టన్ నుంచి రాకుండా మాత్రం ఆపలేకపోయాడు. మొదటి సినిమాలోనే అమితాబ్ బచ్చన్, మాధవన్, బెన్ కింగ్స్లే లాంటి హేమాహేమీల మధ్య ఎటువంటి బెరుకు లేకుండా నటించేసింది.

2010లో విడుదలైన ఈ సినిమాలో శ్రద్ధా కాలేజీ అమ్మాయిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.సినిమా మాత్రం కమర్షియల్ సక్సెస్ కాలేదు. తర్వాత యష్ సంస్థ నిర్మించిన లవ్ ది ఎండ్ లో నటించింది కాని అది బాక్స్ ఆఫీస్ దగ్గర తుస్సుమంది. ఔరంగజేబ్ అనే మరో సినిమా కూడా అదే సంస్థలో చేయాల్సింది కాని ఆశికి 2 కోసం దానితో పాటు మరో సినిమాను కూడా వదిలేయటం శ్రద్ధా కపూర్ జాతకాన్ని సమూలంగా మార్చేసింది.

2013లో వచ్చిన బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఆశికి 2 సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు. ఆరోహి అనే చిన్న గాయని పాత్ర పోషించిన శ్రద్ధా కపూర్ అందులో నటనకు అందరిని ఫిదా చేయటమే కాదు ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ లో కీలక భాగం వహించింది. లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు శ్రద్ధా కపూర్ ని ముంచెత్తాయి. హీరోగా నటించిన ఆదిత్య రాయ్ కపూర్ కంటే ఎక్కువ పేరు తనకే వచ్చింది అంటే తన ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

తర్వాత మోహిత్ సూరి తో చేసిన థ్రిల్లర్ ఎక్ విలన్ మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసింది. ఇందులో తానే పాడిన గాలియా అనే పాట సూపర్ హిట్ అఫ్ ది ఇయర్ గా నిలిచింది. దీని తర్వాత విశాల్ భరద్వాజ్ తో చేసిన ‘హైదర్’ శ్రద్ధ కపూర్ కెరీర్ లో మరో మైల్ స్టోన్. చాలా విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్ తో పోటీ పడి మరీ నటించి మరో సారి ప్రపంచానికి తన టాలెంట్ ప్రూవ్ చేసింది. కరణ్ జోహార్ ఉంగ్లీ సినిమాలో ఐటెం సాంగ్ చేయటం శ్రద్ధాకు కొంచెం చేటు చేసింది.

2015లో చేసిన ఎబిసిడి 2లో తన డాన్సింగ్ టాలెంట్ తో అందరిని మంత్రముగ్దులను చేసింది శ్రద్ధా కపూర్. ప్రభు దేవా, రెమో డి సౌజా లాంటి మాస్టర్ ల ముందు మెప్పించేలా ఆడిపాడి శెభాష్ అనిపించుకుంది. ఇక ప్రభాస్ వర్షం సినిమా చాయాల్లో తీసిన భాగి సినిమా శ్రద్ధాకు మరో పెద్ద కమర్షియల్ సక్సెస్ ని ఇచ్చింది. ఇందులో తెలుగు హీరో సుదీర్ బాబు విలన్ గా నటించాడు. గెస్ట్ రోల్ చేసిన ది ఫ్లయింగ్ జాట్ ఫ్లాప్ కాగా, క్రిటిక్స్ మెచ్చుకున్న రాక్ ఆన్ 2లో మంచి పాత్రే దక్కించుకుంది కాని సినిమా మాత్రం ఆడలేదు. ఓకే జాను, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, హసీనా పార్కర్ సినిమాలు శ్రద్ధా కపూర్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనమైన హిట్స్ ఇవ్వలేదు కాని తనలో మల్టీ టాలెంటెడ్ హీరొయిన్ ని మాత్రం డిఫెరెంట్ షేడ్స్ లో చూపించే అవకాశం ఇచ్చాయి.

ప్రస్తుతం ప్రభాస్ సినిమా సాహోలో హీరొయిన్ గా నటిస్తున్న శ్రద్ధా ఇందులో కూడా నటనకు బాగా స్కోప్ ఉన్న పాత్రనే పోషిస్తున్నట్టు టాక్. అందుకే దర్శకుడు సుజిత్ ఏరికోరి మరీ తనను తీసుకొచ్చాడు. ఇది కాకుండా నైనా నెహ్వాల్ బయోపిక్, మరో హారర్ కామెడీలో నటిస్తున్న శ్రద్ధా కపూర్ పెర్ఫార్మన్స్ బేస్డ్ పాత్రలకే తన ప్రాధాన్యం అంటూ తండ్రిని మించిన తనయగా పేరు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat