అమరావతి రాజధాని భవన నిర్మాణాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శకుడు రాజమౌళి సూచనలు, సలహాలు కోరిక సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం నార్మన్ పోస్టర్ సంస్థ రూపొందించిన భావన నమూనాలు పరిశీలించిన చంద్రబాబు.. వాటికి తెలుగుదనం ఉట్టిపడేలా మార్పులు చేర్పులు చేయాలనీ సూచించారని.. అందుకోసం దర్శకుడు రాజమౌళి సలహాలు తీసుకోవాలని ఆయనను పిలిపించి లండన్ పర్యటించాలని కోరిన సంగతి తెలిసిందే.
అయతే తాజాగా మీడియా ముందుకు వచ్చిన రాజమౌళి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు డిజైన్ల మీద పనిచేయమని చెప్పారని.. నేనే వాటిమీద వర్క్ చేసి ప్రెజంటేషన్ ఇచ్చానని.. అందులో ఆల్‌మోస్ట్ ఒక డిజైన్ అందరికీ నచ్చిందనీ.. సీయం గారు కూడా నైన్టీ పర్సెంట్ ఓకే చేశారని.. ప్రాక్టికల్ ఇష్యూలు ఏమైనా ఉన్నాయా అని రివ్యూ చేస్తున్నారని చెప్పారు. ఇక రెండు డిజైన్స్‌లో ఒకడిజైన్‌లో తెలుగు సంస్కృతికి సంబందించి..తెలుగు తనం ఉట్టి పడేలా ఇమేజెస్ కావాలని అడుగ్గా.. దానికి తగ్గట్టే తెలుగు తనం ఉట్టి పడేలా నేను ప్రెజెంటేషన్ ఇచ్చానని అయితే అవి వారికి నచ్చలేదని.. వాటిని ఓకే చేయలేదని చెప్పారు. తను సూచించిన మార్పులను మీడియా సిటీకి వాడుకుంటామని చెప్పినట్లు తెలిపారు. రామసేతు నిర్మాణంలో ఉడత పోషించిన పాత్ర.. తాను రాజధాని నిర్మాణంలో పోషిస్తున్నట్లు రాజమౌళి తెలిపారు దీంతో సోషల్ మీడియాలో జక్కన్న చెక్కన డిజైన్లు చంద్రబాబు చెత్త బుట్టలో వేశారని.. అమరాతి డిజైన్ల విషయంలో ఓ హడావుడి కథ ముగిసిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.