జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ… వైసీపీ అధినేత జగన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇక అప్పటినుండి పవన్ కళ్యాణ్ పై వైసీపీ పార్టీ నేతలు, ఆయన అభిమానులు పవన్ పై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వెంకటరెడ్డి అనే ఓ అభిమాని పవన్ ను చంపడానికైనా సిద్ధమంటూ ఆవేశంగా నోరు పారేసుకున్నాడు. “జగన్ తో పోలిస్తే పవన్ కల్యాణ్ కోన్ కిస్కా గొట్టంగాడని, జగనన్నను ఏమైనా అంటే చంపడానికైనా, చావడానికైనా సిద్ధమేనని, పవన్ అనే వ్యక్తి బబర్దస్త్ హైపర్ ఆదితో సమానమని… జగన్ అయితే ప్రజలకు దేవుడితో సమానమని, ఆయన ఫొటోలను ఇంట్లో పెట్టుకుంటారని, తనది గుంటూరని, చేతనైతే పవన్ సైన్యం వచ్చి తనను ఎదుర్కోవాలంటూ సవాల్ విసురుతూ” ఓ సెల్ఫీ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు.ఈ వ్యాఖ్యలపై గుంటూరు శివార్లలోని నల్లపాడు పోలీసులు సుమోటో కేసు నమోదు చేసి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు.
జగన్ పై పవన్ అభిమానులు ఏమైన అనవచ్చా..
పవన్ ను ఏమైన అంటే అధికార పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చాడు కాబట్టి వారు అరెస్ట్ చేస్తారు. మరి జగన్ ఏమైన అనవచ్చు…వల్గారుగా మాట్లాడవచ్చా అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రంజిత్ పవనిజం అనే అభిమాని పవన్ కళ్యాణ్ జోలికి వస్తే 100 మందినైనా చంపుతాను అని అదే సోషల్ మీడియాలో చేబితే ఇంతవరకు అతను ఎవరు అని కూడ అడగలేదు… కేసు లేదు ఏమీ లేదు కానీ, వైసీపీ కార్యకర్త అలా అనకపోయినా అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నారు. మీరు చేస్తే సంసారం, అదే పని ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్నట్టుందయ్య అంటున్నారు వైసీపీ అభిమానులు
Posted by Ravindra Ippala on Thursday, 14 December 2017