అవును, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకంటే నేనే వందరెట్లు బెటర్ అంటున్నాడు కత్తి మహేష్. అయితే, ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేశారు. తమకు తామే డప్పుకొట్టుకునే పవన్, చంద్రబాబులు తనముందు బచ్చాగాళ్లన్నారు.
ఇంతకీ ఏ విషయంలో అని అడిగిన విలేకరి ప్రశ్నకు కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కన్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నానని సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ కేవలం 12 తరగతి వరకు చదివి, అందులోనూ పవన్ ఫెయిల్ అయ్యాడని గుర్తు చేశారు. కానీ నేను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశానన్నారు. అసలు చిరంజీవి లేకుంటే.. పవన్ కల్యాణ్ అనే అతను లేడన్నారు. కానీ నేను క్రిటిక్‌ని, నేను చదువుకొని వచ్చాను. ఫిల్మ్ ఎడ్యుకేషన్ చేసి వచ్చాను. పవన్ కల్యాణ్‌కు ఉండేది కుగజ్జీ.. మీ జనసేనకు ఉండేది కులగజ్జీ అందుకే నా స్థాయి గురించి మాట్లాడుతున్నారు అంటూ పవన్ ఫ్యాన్స్‌పై కత్తి మహేష్ ఫైరయ్యాడు.
ఇక చంద్రబాబు గురించి కత్తి మహేష్ మాట్లాడుతూ.. చంద్రబాబూ.. అన్నీ నావల్లే వచ్చాయని, ప్రపంచాన్ని సృష్టించమని దేవుడికి సజీషన్ ఇచ్చింది కూడా నేనేనని చెప్పేస్తూ ప్రజల ముందు నవ్వులపాలవుతున్నారని ఎద్దేవ చేయడంతోపాటు అంటూ చంద్రబాబుపై వెటకారం ప్రదర్శించాడు కత్తి మహేష్. నేను హైటెక్ సిటీ కట్టించాను. నేను బిల్‌గేట్స్‌ను రప్పించాను. నేను —, నేను — అన్నీ నీవేనా. ప్రజల భాగస్వామ్యం ఏమీ లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి నేను అన్న అహంభావన ఉండటం సిగ్గుచేటని, అతను కేవలం వ్యక్తిగానే కాకుండా.. వ్యవస్థలా ఆలోచించాలని చంద్రబాబుపై ఫైరయ్యాడు కత్తి మహేష్.