ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకపోతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఘనమైన ఆర్థికవృద్ధి నమోదు చేసిందని వెల్లడించారు. హైరాబాద్ టెక్‌మహీంద్రా క్యాంపస్‌లో మిషన్ ఇన్నోవేషన్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జనవరి 1 నుండి రైతులకు ఎలాంటి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ అందించబోతున్నామని ఇది దేశంలోనే మొదటిసారి అని మంత్రి కేటీఆర్ వివరించారు. రోజువారీ జీవితాల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎడ్యుకేషన్,హెల్త్ రంగాల్లో టెక్నాలజీది కీలక పాత్ర అని మంత్రి కేటీఆర్ వివరించారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే విద్యార్థులకు టీశాట్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ అనేది ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య అని పేర్కొన్న మంత్రి కేటీఆర్ దీన్ని అధిగమించేందుకు, ఇందులోని ఉద్యోగ అవకాఆలను సొంతం చేసుకునేందుకు తాము సైబర్ సెక్యురిటీ పాలసీని ప్రవేశపెట్టినట్లు వివరించారు.
పారిశ్రామిక అభివృద్ధికి సింగిల్ విండో విధానంతో 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. రెండున్నర సంవత్సరాల్లో టీఎస్‌ఐపాస్ ద్వారా 5,500 పైచిలుకు పరిశ్రమలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టబడులు పెట్టాయని వివరించారు.ఒక్క రోజులో హైదరాబాద్ అభివృద్ధి చెందలేదని…ఈ నగరానికి ఉన్న అనుకూలతలు హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడ్డాయని మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రపంచశేణి ప్రమాణాలతో నగరాన్ని మార్చడానికి బోతున్నామని ప్రణాళికలు తీర్చిదిద్ది పటిష్టంగా అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. మౌళిక వసతుల కల్పనలో దేశంలోనే నగరాన్ని ఆదర్శంగా నిలుపబోతున్నామన్నారు. భాగ్యనగరానికి 450 ఏళ్ల సుదీర్ఘ చరిత ఉందని, సంస్కృతిని పరిరక్షించుకుంటూనే…భవిష్యత్తుకు తగిన ప్రణాళికలు సాగుతున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు.
త్వరలోనే బస్తీ దవఖానాలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. నగర దాహార్తిని తీర్చడానికి 10టీఎంసీల సామర్థ్యం తో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. పచ్చదనంలో నగరాన్ని దేశానికే ఆదర్శంగా నిలుపబోతున్నామని వెల్లడించారు. నగరంలో పచ్చదనం పెంచేందుకు దాదాపుగా రెండున్నర కోట్ల మొక్కలను నాటి సంరక్షిస్తున్నట్లు వెల్లడించారు. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 4 టౌన్‌షిప్‌లును నిర్మించబోతున్నామని మంత్రి వివరించారు.
Post Views: 188