ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు . హైరాబాద్ టెక్‌మహీంద్రా క్యాంపస్‌లో మిషన్ ఇన్నోవేషన్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.ఈ సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీహబ్-2 నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఐటీలో మేటి కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నయి. ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. కాలేజీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఉపాధి, నైపుణ్య అభివృద్ధిలో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కులీకుతుబ్‌షా నిర్మించిన ఈ నగరం ప్రపంచ ఖ్యాతిని పొందిందన్నారు. నిరంతర కృషితో వెలుగుల తెలంగాణ సాధించామన్నారు. రెప్పపాటు కరెంట్ పోకుండా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఇంటింటికీ నీళ్లుఇవ్వాలనే మిషన్ భగీరథ తీసుకొచ్చినట్లు వివరించారు. విశ్వనగరం విజన్‌తో ముందుకు వెళ్తునట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
IT Minister @KTRTRS in conversation with @C_P_Gurnani @tech_mahindra #MI18TechM pic.twitter.com/K5MlAevxe2
— Min IT, Telangana (@MinIT_Telangana) December 14, 2017