హైదరాబాద్ టెక్‌మహీంద్రా క్యాంపస్‌లో `మిషన్ ఇన్నోవేషన్ సదస్సు`లో మంత్రి కేటీఆర్ ప్రసంగానికి టెకీలు ఫిదా అయ్యారు. సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు ఐటీ మంత్రి కేటీఆర్. దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయన్నారు. టీహబ్-2 నిర్మాణ దశలో ఉందని చెప్పారు. ఐటీలో మేటి కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నయి. ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అనేక అంశాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉద్యోగుల సందేహాలకు సమాధానం ఇచ్చారు.
అయితే మంత్రి కేటీఆర్ చేసిన ఈ సవివర ప్రసంగం, అనంతరం ఆయన స్పందించిన తీరుకు ప్రశంసలు కురిశాయి. మిషన్ ఇన్నోవేషన్ జరిగిన తర్వాత టెక్ మహీంద్రా సీఈఓ సీపీగుర్నానీ తన ఉద్యోగులు చేసిన ట్వీట్ ఆధారంగా మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు. ‘టెక్ మహీంద్రాలోని నా సహచరులంతా…కేటీఆర్ రాక్‌స్టార్ పొలిటీషియన్ అని ప్రకటించేశారు’ అని పేర్కొన్నారు. ‘చెన్నైలో ఉన్న ఉక్కపోత, బెంగళూరులోని ట్రాఫిక్, ఢిల్లీలో ఉన్న పొగమంచును కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం’ అంటూ హైదరాబాద్‌లో అలాంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఈ ట్వీట్‌పై మంత్రి స్పందిస్తూ..‘మీ ఆఫీసును వెంటనే హైదరాబాద్‌కు మార్చండి’ అంటూ చమత్కారంగా ప్రతిపాదించారు.