`ఒక్కోసారి ఏదైనా చేయాలన్న తపన ఉన్నా.. ఉన్నతాధికారులు సహా ఇతరత్రా కారణాల వల్ల చేయలేకపోవచ్చు. అయినప్పటికీ ఉన్న హద్దుల్లో అయినా సేవ చేయాలి అనుకోవాలి కానీ నిరుత్సాహపడొద్దు. దేశానికి, సమాజానికి మీ తోడ్పాటు, సహకారం కీలకం` ఇది రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ వ్యక్తం చేసిన అభిప్రాయం.
హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో…అల్ ఇండియా సర్వీస్, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ 92వ ఫౌండేషన్ కోర్స్ ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియా లో సివిల్ సర్వీసెస్ అధికారుల బాధ్యత కీలకమని అన్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా… మౌళికవసతులు, కనీస తాగునీరు, విద్యుత్ సరఫరా లేని గ్రామాలు చాలా ఉన్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ లైన్ ఫోన్ కూడా లేని స్థాయి నుంచి… నేడు దేశ జనాభాను మించి మొబైల్ ఫోన్స్ ఉన్నాయని చెప్పిన మంత్రి కేటీఆర్ ఇలాంటి వాటిలో దేశం వృద్ధి చెందుతోందని అన్నారు. అయితే అన్నివర్గాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు రావాలన్నారు.
అధికారులుగా మీరు భాద్యతలు తీసుకున్న తర్వాత.. ఏ ప్రాంతం లో పని చేసినా.. మీ సర్వీస్ లో మీదైన చెరగని ముద్ర వేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. పదవి బాధ్యతల పరంగా విధులు నిర్వహిస్తూనే..సమాజంలో మార్పుకోసం తమ వంతు కృషిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలను అభివృద్ధిలో భాగం చేసేందుకు ప్రణాళికలు వేస్తోందని మంత్రి కేటీఆర్ వివరించారు.
Spoke at the FC valedictory of All India service officers at MCRHRD institute
Appealed to them to serve in right earnest the young & impatiently optimistic, passionate Indians who desire accelerated all round progress pic.twitter.com/47eUfcq3we
— KTR (@KTRTRS) December 14, 2017