గుజరాత్ శాసనసభ ఎన్నికల మొదటి దశతో సగభాగం పోలింగ్ పూర్తయింది. మిగిలిన సగభాగం నియోజకవర్గాలకు డిసెంబర్ 14వ తేదీన పోలింగ్ జరగబోతోంది. పశ్చిమ భారతదేశంలోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాలే 18 మాసాలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయని దేశంలో చాలామంది భావిస్తున్నారు. ఇక మోదీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లో జరగతున్న ఎన్నికలు మోడీకి బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. మరోవైపు నుండి దేశావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉన్నదన్న విషయమే ప్రజలు మరిచిపోయే స్థితి నుండి పోటీ ఇచ్చేస్తాయికి కాంగ్రెస్ ఎదగడం బీజేపీని కలవరపెడుతోంది.
దీంతో అత్యంత రసవత్తరంగా గుజరాత్ ఎన్నికలు జరుగుతున్న వేళలో ఏపీ ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్.. ఓ సర్వే నిర్వహించాడని తాజాగా ఆ సర్వే రిపోర్ట్ బయటకి వచ్చిందని.. సోషల్ మీడియాలో ఓ వార్త హాల్‌చల్ చేస్తోంది. గుజరాత్లో మొత్తం 2.11 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ప్రతికూలత ఎదురైనా విజయానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ సాదిస్తుందని లగడపాటి సర్వేలో తేలిందట. మొత్తం 50 నియోజకవర్గాల్లో 3,655 మంది ఓటర్లతో సర్వే జరపగా… బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 43 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. 182 అసెంబ్లీ స్థానాలకి గాను బీజేపీకి 91-99 సీట్లు, కాంగ్రెస్ కు 78-86 సీట్లు వస్తాయని ఆ సర్వే తేల్చింది. 22ఏళ్లుగా అధికారంలో ఉంది బీజేపీ మరోసారి ఎన్నికల్లో గెలుపొందనున్నదని ఈసంస్థ తేల్చింది. బిజెపిని గుజరాత్‌లో దెబ్బకొట్టి తిరిగి పుంజుకోవాలని ఆశపడుతున్న కాంగ్రెస్ కలలు.. ఆవిరి అవడం ఖాయమని ఆ సర్వే తేల్చేసింది. మరి లగడపాటి సర్వే మ్యాజిక్ గుజరాత్‌లో ఏమాత్రం పని చేస్తుందో చూడాలి.