గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ, తుది విడత పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన విషయం తెలిసిందే . మొత్తం 93 నియోజక వర్గాల్లో ఈసీ పోలింగ్ నిర్వహించనుంది.బరిలో మొత్తం 851 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఆ నేపధ్యంలో చలిని కూడా లెక్కచేయకుండా ఓటర్లు ఉదయం నుంచే లైన్లలో నిలబడుతూ ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
PM Modi's mother Heeraben cast her vote in a polling booth in Gandhinagar #GujaratElection2017 pic.twitter.com/5PJxvGbf91
— ANI (@ANI) December 14, 2017
ఈ క్రమంలో మొదటి గంటలోనే ఓటు వేసేందుకు ప్రధాని మోదీ తల్లి, 97 ఏళ్ల వృద్ధురాలైన హీరాబెన్ మోదీ గాంధీనగర్‌లోని పోలింగ్ బూత్‌కు వచ్చారు. సిబ్బంది సాయంతో పోలింగ్ బూత్‌కు వచ్చిన హీరాబెన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
PM Modi's mother Heeraben arrives to cast her vote in a polling booth in Gandhinagar #GujaratElection2017 pic.twitter.com/orVeaNEKY6
— ANI (@ANI) December 14, 2017