టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో జనసేన పార్టీ పెట్టిన సంగతి తెల్సిందే .విభజన తర్వాత జరిగిన మొట్టమొదటి సారిగా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలకు మద్దతు తెలిపాడు .దీంతో నాలుగు ఏండ్లుగా జనసేన టీడీపీ సర్కారుతో కల్సి పని చేస్తున్నారు .
ఈ నేపథ్యంలో జనసేన అధినేత రాష్ట్రంలోరాజధాని జిల్లాలో ఆ పార్టీ కార్యాలయాన్నిఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు . ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో చిన్నకాకని గ్రామానికి చెందిన 182/1 ,181 సర్వేలో ఉన్న పది ఎకరాల భూమిలో మూడు ఎకరాలల్లో పార్టీ కార్యాలయం నిర్మాణానికి లీజుకు తీసుకున్నారు .
అయితే ఆ స్థలం రైతు యార్లగడ్డ సుబ్బారావుకు చెందినది కాదు .అసలైన ఆ భూమి వారసులం మేమే అంటూ కొందరు గురువారం మీడియా ముందుకు వచ్చారు .అందులో భాగంగా రాష్ట్రంలోని విజయవాడ నగరంలో ముస్లిం ఐక్య వేదిక కార్యాలయంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిర్మిస్తాను అన్న జనసేన పార్టీ కార్యాలయం స్థలం తమది .అవసరమైతే కోర్టులో కేసు వేస్తామని వారు ఈ సందర్భంగా వివరించారు .