టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటున్న సంగతి తెల్సిందే .స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మూవీలో పవర్ స్టార్ నటిస్తున్నారు .అయితే పవన్ కళ్యాణ్ కు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి .
ఇటివల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ,బీజేపీ నేతల వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా విమర్శల వర్షం కురిపించారు .ఈ నేపథ్యంలో పవన్ పై ఒక వ్యక్తీ సోషల్ మీడియాలో విమర్శలకు దిగాడు .ఆ పోస్టులో జగన్ గురించి మాట్లాడితే చంపడానికైన సిద్దమే అని పోస్టింగ్ పెట్టాడు. దీనిని సుమోటోగా స్వీకరించిన ఏపీలో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరి ఈ పోస్టింగ్ పై ఇప్పటి వరకు జనసేన అధినేత కాని, పార్టీ అధికారులు కాని, మెగా ఫ్యాన్స్ కాని ఎవరు స్పందించకపోవడం మరో విశేషం.