తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన టీడీపీ పార్టీ సీనియర్ మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ఈ రోజు గురువారం తన తనయుడితో సహా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు .
తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన వారిలో ఒకరైన ముఖేష్ గౌడ్ టీఆర్ఎస్ గూటికి చేరనున్నారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన గోషామహల్ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు .
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తోలిసార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి రాజసింగ్ చేతిలో నలబై ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు .అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎంపీతో ముఖేష్ రాయభారాలు నడిపి కారు ఎక్కడానికి సిద్ధమైనట్లు సమాచారం .అందుకు తగ్గట్లు ఈ నెల 15న తారీఖున తన అనుచరవర్గంతో భేటీ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం .చూడాలి మరి ఆయన చేరికపై వస్తున్న వార్తలు నిజామా ..కాదా అని ..