ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై చంద్రబాబు సర్కార్‌ను నిలదీసేందుకు.. ప్రజలకు మరింత దగ్గరైవారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను గుర్తించేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తమ వద్దకు వచ్చిన వైఎస్‌జగన్‌కు తమ సమస్యలను చెప్పుకోవడంతోపాటు అర్జీలను కూడా సమర్పిస్తున్నారు ప్రజలు. నిరుద్యోగులైతే.. తమకు ఇంత వరకు చంద్రబాబు సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని, వృద్ధులైతే తమకు పింఛన్ రావడం లేదని, ఇలా వారి వారి సమస్యలను జగన్‌కు అర్జీల రూపంలో తెలుపుతున్నారు ప్రజలు.
కాగా, నిన్న జరిగిన పాదయాత్రలో వైఎస్ జగన్ చంద్రబాబు సర్కార్‌పై విమర్శనాస్ర్తాలు సంధించడంతోపాటు జోకులు పేల్చారు. చంద్రబాబు సర్కార్ ఎన్నికలు వచ్చే సమయానికి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. సినిమా యాక్టర్లను, డైరెక్టర్లను పక్కన పెట్టుకొస్తాడంటూ ఎద్దేవ చేశారు. బహుశా.. ఏమీ చేయకపోయినా కూడా డైరెక్టర్లు చూపిస్తారుకదా అందుకోనేమో.. యాక్టర్లను, డైరెక్టర్లను చంద్రబాబు సర్కార్ పక్కన పెట్టుకుంటుందన్నారు జగన్. మొన్ననే పేపర్లో చదివా బాహుబలి డైరెక్టర్ చంద్రబాబు నాయుడును పిలిపించుకుని అమరావతిపై సినిమా తీయమన్నాడట. నాలుగు సంవత్సరాలు పూర్తయినా పర్మినెంట్ పేరుతో ఇంత వరకు ఒక్క ఇటుక కూడా పడని అమరావతిపై ఏం సినిమా తీస్తారని ప్రశ్నించారు జగన్. డైరెక్టరేమో సెట్ వేస్తారు.. చంద్రబాబు మాత్రం ఆ సెట్ నుంచి అలా నడుచుకు వస్తారు.. మరో పాత్రలో మంత్రి నారాయణ ఎంట్రీ ఇస్తాడంటూ జగన్ జోకులు పేల్చారు.