తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పై ఏపీ ప్రజలు మరోసారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా హైటెక్స్‌లో జరిగిన టెక్ మహీంద్రా ఎంఐ-18 వార్షిక ఆవిష్కరణ దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ ఇచ్చిన సమాధానం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేటీఆర్ సమాధానం ఇస్తూ ప్రపంచంలో ఐటీ హబ్‌గా హైదరాబాద్‌ను నిలపడంలో చంద్రబాబు కృషి అమోఘమని, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌కు రావడంలో నా కృషి ఏమీ లేదు. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.
దీంతో గతంలో 108 విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నాటి ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పతనాన్ని మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఐటి సంస్థల విషయంలో చంద్రబాబుకు క్రెడిట్ ఇవ్వడంతో.. తండ్రీ కొడుకు లిద్దరికీ ఏపీ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు లాగా జరిగిన ప్రతి అభివృద్ది పనికి తనే కర్త అని.. ఎదైనా తేడా జరిగితే ఇతరుల మీద తోసేయడం బాబు గారికి వెన్నతో పెట్టిన విధ్య.. మరి అలాంటి చంద్రబాబు గురించి కూడా పాజిటీవ్‌గా కేటీఆర్ చెప్పడంతో ఆయన సంస్కారం మరోసారి బయటపడింది. దీంతో సోషల్ మీడియాలో నాడు కేసీఆర్.. నేడు కేటీఆర్.. ఇద్దరికీ ఏపీ ప్రజలు సెల్యూట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.