బుల్లితెరపై యాంకర్లుగా రవి, శ్రీముఖి చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఒకరిపై మరొకరు పంచ్‌లు వేసుకుంటూ తాము చేస్తున్న షోలకు క్రేజ్ రావాలనే ఉద్దేశంతో అమాంతం రెచ్చిపోతుంటారు వీరు. ఈ షోలను చూసిన గాసిప్స్ రాయుళ్లు.. వారి ఆలోచనలకు పదునుపెట్టి ఒకటికి పది అడుగులు ముందుకేసి వారి పెన్నుకు పదునుపెట్టి గాసిప్స్ రాసేస్తుంటారు కూడా.
ఇటీవల యాంకర్ రవి హీరోగా తెరకెక్కిన చిత్రం.. ఇది మా ప్రేమ కథ. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో బాగా బిజీబిజీగా గడుపుతున్నాడు యాంకర్ రవి. ఈ క్రమంలోనే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ రవి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రశ్న ఒకటి ఎదురైంది.
మీకు పెళ్లి అయిందా..? లేదా..? అంటే నా పర్సనల్.. పర్సనల్ అంటుంటారంటా..! ఏంటీ విషయం అంటూ విలేకరు అడిగిన ప్రశ్నకు స్పందించిన యాంకర్ రవి మాట్లాడుతూ.. నేనొక శ్రీదేవినో.. శ్రీముఖినో పెళ్లి చేసుకుంటే అఫిషియల్ అవుతుంది కానీ.. నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకండీ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ మాటలు విన్న విలేకరు అంటే శ్రీముఖిని పెళ్లి చేసుకోవాలని మీ మదిలో ఉందన్న మాట..! అంటూ అనగా.. అలా అర్థమైందా! మీకు అంటూ ఫన్నీ కామెంట్ చేశాడు యాంకర్ రవి.