Home / MOVIES / న‌యా ట్రెండ్ సెట్ట‌ర్‌.. విజ‌య్ దేవ‌ర కొండ టూ అర్జున్ రెడ్డి జ‌ర్నీ..

న‌యా ట్రెండ్ సెట్ట‌ర్‌.. విజ‌య్ దేవ‌ర కొండ టూ అర్జున్ రెడ్డి జ‌ర్నీ..

అర్జున్ రెడ్డి.. ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బీభ‌త్స‌మైన‌ పాపులారిటీ సంపాదించిన పేరు. ఎవ‌డే సుభ్ర‌మ‌ణ్యం, పెళ్లి చూపులు చిత్రాల‌తో మంచి ఫేం సంపాదించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ ఇయ‌ర్ అర్జున్ రెడ్డి చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయ‌డ‌మే కాకుండా.. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో అంటే ముఖ్యంగా నేటి క్రేజీ యువ‌త న‌రాన‌రాన ఎక్కేసిన విజ‌య్ దేవ‌రకొండ సినీ జ‌ర్నీ అర్జున్ రెడ్డి వ‌ర‌కు ఎలా సాగిందో..  ప్ర‌త్యేక క‌థ‌నం..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ రవిబాబు తెర‌కెక్కించిన‌ నువ్విలా చిత్రం, శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో చిన్న పాత్రల్లో కనిపింంచిన‌ విజయ్… ఆ సమయంలోనే సహాయ దర్శకుడు నాగ్ అశ్విన్ పరిచయమవ్వ‌డం.. 2015లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నానితో కలసి రిషి పాత్రలో నటించాడు. ఇక ఆ చిత్ర నిర్వాత‌లు ప్రియాంకా దత్, స్వప్నా దత్‌లు.. విజ‌య్ టాలెంట్ చూసి తమ సంస్థలో రెండు చిత్రాలు చేసేందుకు విజయ్‌తో అగ్రిమెంట్ చేసుకున్నారు.

ఇక ఆ త‌ర్వాత కెరీర్‌నే ఓ మ‌లుపు తిప్పింది. 2016లో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రీతువర్మ సరసన పెళ్ళిచూపులు చిత్రం ఆయన కెరీర్లోనే అతి పెద్ద విజయం సాధించిన సినిమాగా నిలిచింది. ఇక 2017లో తెలుగు సినీవ‌ర్గీయుల్లో అతిపెద్ద సెన్షేష‌న్ అయితే చిత్రం అర్జున్ రెడ్డి. ఆ చిత్రం ద‌క్షినాదిన ఎంత ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిందో బాక్సాఫీస్‌ను కూడా అంతే కుమ్మేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల యూత్‌కి అర్జున్ రెడ్డి ఒక బ్రాండ్ అనే విధంగా విజ‌య్ త‌న‌కంటు ఒక ట్రెండ్‌ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇక అర్జున్ రెడ్డి ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే.. విజయ్ దేవరకొండ మే 9, 1989 లో హైదరాబాద్ లో పుట్టారు. అయన తల్లి పేరు మాధవి, తండ్రి గోవర్దన్ రావ్ దేవరకొండ. వీరిది తెలంగాణ రాష్ట్రమే అయితే విజ‌య్ చిన్న‌ప్పుడు నుండి ఏపీలోని అంతపురం జిల్లలో ఉన్న పుట్టపర్తి శ్రీ సత్య సాయి ఉన్నత పాఠశాలలో చదువుకున్నాడు. టీవీలు, ఫోన్లు వంటి గాడ్జెట్లకు దూరంగా ప్రశాంతమైన వాతావరణం ఆ స్కూల్‌లో ఉండేది. ఇక ఆ స్కూల్‌లో చదువుతో పాటు ఆటలు, సాంప్రదాయ కళల్లో రాణించిన వారు ఎందరో ఉన్నార‌ట‌. ఇక అక్కడ చదివిన కారణంగానే కథా రచన, నటనపై ఆసక్తి పెంచుకున్నట్లు తెలిపాడు విజయ్. అయితే స్కూల్ డేస్‌లో అతడు చాలా అమాయకంగా ఉండేవాడట. ఇక స్కూలు చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లో లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశలలో ఇంటర్.. బదృకా కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు.

ఇక విజ‌య్ కుటుంబం విషయానికి వస్తే.. విజయ్ తండ్రి టివి సీరియల్స్‌కు దర్శకత్వం వహించేవార‌ట‌. విజయ్‌కి తన తండ్రే స్ఫూర్తి అట‌. సినిమాల్లో నటించేందుకు మహబూబ్ నగర్ లోని అచ్చంపేట నుంచి హైదరాబాద్ వచ్చారట‌ విజయ్ తండ్రి. తల్లి మాధవి వ్యక్తిత్వ వికాస నిపుణురాలుగా హైద‌రాబాద్ అశోక్ న‌గ‌ర్‌లో ఇనిస్టిట్యూట్‌ని న‌డిపేవార‌ట‌. అప్పుడ‌ప్పుడు పాకెట్ మ‌నీ కోసం విజ‌య్ అక్క‌డ క్లాసులు కూడా చెప్పేవాడ‌ట‌. ఇక విజయ్ తమ్ముడు ఆనంద్ అమెరికాలోని డిలాయిట్ కంపెనీలో పని చేస్తున్నాడట‌. కెరీర్ విషయానికి వస్తే.. సూత్రధార్ అనే నాటక సమాజంలో 3 నెలల వర్క్ షాప్‌లో పాల్గొన్న విజయ్, హైదరబాద్ థియేటర్ సర్క్యూట్ లో ఎన్నో నాటకాలు చేశారు. అలా ఎన్నో నాటకాల్లో నటించిన తరువాత సినిమాల్లో ప్రయత్నించి నేడు తెలుగు సినీ చ‌రిత్ర‌లో త‌న‌కంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు.. సో ఇదండీ ఒక‌ప్పుడు శివ త‌ర్వాత అదే రేంజ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ టూ అర్జున్ రెడ్డి జ‌ర్నీ.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat