సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వేణుస్వామి జోస్యాలు హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో వేణుస్వామి ఇప్పటికే సోషల్ మీడియాలో జాతకాలు తెలుసుకునే వారందరికీ బాగా సురపరిచితం అయిపోయాడు. అయితే ఈ జ్యోతిష్కుడు సామాన్యుల జాతకాలు చెప్తాడో లేదో గానీ.. సెలబ్రిటీల గురించి వారు అడక్కుండానే చెప్పడమే కాకుండా.. యూట్యూబ్ ఛానల్‌లో పెట్టేస్తాడు… యూట్యూబ్‌లో అన్నీ సంచలనాత్మక టాపిక్స్‌కి మాత్రమే వేణుస్వామి ఛానల్‌లో ప్లేస్ ఉంటుంది.
అయితే ఇప్పుడు తాజాగా మరో హాట్ టాపిక్‌తో వేణుస్వామి.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పటికే ఏపీకి రాబోవు రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటూ.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ నడుస్తుండగా.. వేణుస్వామి మాత్రం సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. 2019 తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. మరి ఇప్పటి వరకు తారక్ క్రియాశీల రాజకీయాల్లోకి రానే రాలేదు.. మరి ఎన్టీఆర్ జాతకాన్ని ఏ కోణంలో చూసి వేణుస్వామి అలా చెప్పారో.. లేక సోషల్ మీడియాలో చాలా మంది చెప్పుకుంటున్నట్లు.. ఫేమ్ సంపాదించుకోవడానికి అలా చేస్తున్నారో ఆయనకే తెలియాలి.