ఏపీ రాజకీయాల్లో సీయం కుర్చీ పై హాట్ టాపిక్ నడుస్తోంది.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీయం కుర్చీ కోసం ఒకవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ నువ్వా-నేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నేను కూడా రేసులోకి వస్తున్నా అంటూ అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నారు.
అయితే చంద్రబాబు, జగన్‌ల గురించి పక్కన పెడితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఒక హాట్ టాపిక్ సోషల్ మీడియాలో హాల్‌చల్ అవుతోంది. పవన్ కళ్యాణ్‌కు సీయం అయ్యే యోగం ఎట్టి పరిస్థితుల్లో లేదంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తేల్చి చెప్పారు. ఇక యూట్యూబులో వీడియో ద్వారా మాట్లాడిన వేణుస్వామి.. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడో లేదో తెలియదని… ఆయన జాతకరీత్యా ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదని చెప్పారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వేణుస్వామి పై పీకే ఫ్యాన్స్ అటాక్ మొదలు పెట్టారు. అయతే వేణుస్వామి మాత్రం ఎవరి జాతకరీత్యా ఏం జరగాలో అదే జరుగుతుంది… నా పని నేను చేసుకుంటున్నా… మీరు నన్ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తే నేను మాత్రం పట్టించుకోనని వేణుస్వామి అన్నారు.