ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగలనున్నది .ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకొని ఏపీలో వైసీపీని బలహీన పరచాలి అని ఆలోచిస్తుంటే ..మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,మాజీ మంత్రులు ,సీనియర్ నేతలు అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు .
అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి రేపు గురువారం తన తనయుడుతో కల్సి అనుచరవర్గంతో ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు .తాజాగా మరో ఎమ్మెల్యే అదే బాటలో నడవనున్నారు అని వార్తలు వస్తున్నాయి .రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎస్ వెంకట వీరయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .
ఇప్పటికే పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి ..రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు .మిగిలిన ఇద్దరిలో ఆర్ కృష్ణయ్య కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే పార్టీకి గుడ్ బై చెప్తాను ఇటివల బాబును కల్సి తెగేసి చెప్పారు .తాజాగా వెంకటవీరయ్య రాష్ట్రంలో కనుచూపు మేర టీడీపీ పార్టీ బ్రతికి బట్ట కట్టే పరిస్థితులు లేకపోవడం ..టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళే వీలు లేకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని జిల్లా రాజకీయాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఒకే పార్టీ తరపున మూడు సార్లు గెలిచిన చరిత్ర లేకపోవడంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వైపు వెళ్ళుతున్నారు అని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు ..