ఏపీలో వారసత్వ రాజకీయాల పై జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తాజగా ఓ ప్రముఖ న్యూస్ చానల్ వారసత్వ రాజకీయాల పై నిర్వహించిన డిబేట్లో సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ పళ్ళు రాలగొడతానని వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. లైవ్‌లో వారసత్వ రాజకీయాల పై చర్చించడానికి బండ్ల గణేష్ వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫోన్ ద్వారా ఆ చర్చలో పాల్గొన్నారు. దీంతో వారసత్వ సినీ రాజకీయాల పై మీ అభిప్రాయం ఏంటని రోజాని అడుగగా.. రోజా మాట్లాడుతూ చిరంజీవి ఇంట్లో ఆయనలా కష్టపడి పై కొచ్చిన వాళ్లు చాలా తక్కువని.. మహామహులతో పోటీపడి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారని అన్నారు. అయితే ఆయన తమ్ముళ్లు, కొడుకు, మేనల్లుళ్లు, తాజాగా అల్లుడు వీళ్ళంతా కేవలం చిరంజీవి చరిష్మాతో వచ్చేస్తున్నారు. వీళ్లే కనుక చిరంజీవి కుటుంబసభ్యులు కాకపోయింటే అవకాశాలు ఎవరిస్తారు.. వాళ్లకు ప్రతిభ ఉందా లేదా అనే విషయం తర్వాత తెలుస్తోందని.. పరిచయం కావడమనేదే చాలా ముఖ్యమని రోజా అన్నారు. రోజా మాట్లాడుతుండగా.. బండ్ల గణేష్ మధ్యలో దూరి
పవన్ కల్యాణ్‌ని మీరు వాడు వీడు అంటే నాకు కోపమొచ్చింది. ఇప్పుడు, కల్యాణ్ బాబు గారని మీరన్నారు. నేనేమి మాట్లాడలేను. నాకు మీరంటే గౌరవం. ఆయన్ని వాడు, వీడు అని మీరు మాట్లాడతారా.. అని బండ్ల గణేశ్ అనడంతో.. రోజా సమాధానం ఇస్తూ మీరంటే కూడా నాకు గౌరవం ఉంది.. ఆవేశపడకండి, నేను చెప్పేది వినండని అన్నారు. కల్యాణ్ బాబు మిమ్మల్ని ఎప్పుడైనా ఏమన్నా అన్నాడా.. జగన్ గారిని పవన్ కల్యాణ్ ఏమన్నాడమ్మా.. పవన్‌ను వాడూవీడూ అని మీరు అనొచ్చా.. గౌరవం ఇవ్వండి మేడమ్ అని రోజాను ప్రశ్నించారు. దీనిపై రోజా స్పందిస్తూ పవన్ కల్యాణ్‌ని జగన్ ఏమైనా అన్నారా.. జగన్ గారిని ఎందుకంటున్నారు.. అంతేకాదు వాడూ వీడూ అని ఎవరూ మాట్లాడలేదు… మీరు ఆవేశం తగ్గించుకోవాలని ఆమె హితవు పలికారు. అలాగే పాయింట్ మాట్లాడటం నేర్చుకోండని రోజా అన్నారు. దీంతో బండ్ల గణేష్- రోజాకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో రెచ్చిపోయిన బండ్ల.. అవును… పాయింట్ మాట్లాడటం రాకే మేము ఎమ్మెల్యేలు కాలేదు. మీకు పాయింట్ మాట్లాడటం వచ్చింది కాబట్టే ఎమ్మెల్యే అయ్యారు. రెండు సార్లు ఓడిపోయారు.. ఒకసారి గెలిచారు… మీది గోల్డెన్ లెగ్ అని దేశం మొత్తం కోడై కూస్తోంది. ఆ గోల్డెన్ లెగ్ ఎప్పుడూ వైఎస్ జగన్ వెంటే ఉండి, ఆయణ్ని సీఎంను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎద్దేవా చేశారు. అంతేకాదు రాజశేఖరరెడ్డిని పైకి పంపించేశారు, గొప్ప నాయకురాలివి, మహాతల్లివి అని వ్యంగ్యంగా అన్నారు. దీంతో రోజా ఆవేశంగా మాట్లాడుతూ… రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుంది.. గెలిచినా, ఓడినా ప్రజల్లో ఉంటూ కష్టపడుతున్నాం. మీరు, నాకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసందర్భ ప్రేలాపన ఆపకపోతే పళ్లు రాలగొడతా అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. బండ్ల కూడా నీ పళ్లు రాలిపోతాయి అంటూ రోజాను కూడా దూషించడంత.. ఆ చర్చ కాస్తా వ్యక్తిగత దూషణలుగా మారిపోయింది.